Friday, November 22, 2024
Homeటాప్ స్టోరీస్రంగనాథా.. మజాకా..

రంగనాథా.. మజాకా..

రూటే సపరేట్..
25 రోజుల్లో.. 20 కూల్చివేతలు..
సొంత ఆఫీసు.., సొంత పోలీస్ స్టేషన్..
గతంలో వరంగల్ తో తనదైన మార్క్
స్పాట్ వాయిస్, బ్యూరో: సారు రూటే సపరేటు. ఎక్కడ పనిలో చేరినా మరుసటి రోజునుండే పరిస్థితులు మారాల్సిందే. లేదంటే పర్సన్స్ అక్కడ నుంచి మార్చివేయబడుతారు. కబ్జాదారుల గుండెల్లో నిద్రపోయే రంగనాథ్ సారంటే సామాన్యులకు దైవ సమానులు. పేదల పక్షపాతిగా వ్యవహరించే ఆయనకు పని అప్పగించాలేగానీ సంపూర్ణంగా చేసేవరకు విశ్రాంతితీసుకోరు. గతంలో బీఆర్ఎస్ సర్కార్ ఉన్నప్పుడు గ్రేటర్ వరంగల్ సీపీగా బాధ్యతలు స్వీకరించిన రంగనాథ్ అక్రమార్కుల పాలిట సింహస్వప్నమయ్యారు. వరంగల్ లో పేరుకుపోయిన భూసమస్యలపై ప్రత్యేక నిఘా పెట్టారు. నిబంధనలు అతిక్రమించిన బడాబాబుల విషయంలో కల్కి అవతారం ఎత్తి చీల్చిచెండాడు. స్వయంగా అప్పటి చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ప్రధాన అనుచరుడిగా పేరున్న కార్పొరేటర్ నే కటకటాల్లోకి నెట్టి తానేంటో ఘంటాప్రథంగా చూపించారు. అధికార పార్టీకి చెందిన బడా నాయకులు కూడా ముక్కున వేలేసుకునేలా తన పనితీరుతో శభాష్ అనిపించుకుని పేద ప్రజలకు భరోసా నింపారు. ఒక నిబద్ధతతో కూడిన పోలీసు అధికారికి పాలాభిషేకాలు జరిపే సంప్రదాయానికి వరంగల్ ప్రజలు శ్రీకారం చుట్టారంటే రంగనాథ్ వృత్తినిబద్ధత ఎంతటితో తెలుసుకోవచ్చు. అలాంటి అధికారికే సీఎం రేవంత్ సరైన టాస్క్ ఇచ్చి గో ఎహెడ్ అనడంతో ఇక హైదరాబాద్ తనకు తానే మురుస్తున్నది.

కేవలం 25 రోజుల్లో..
బాధ్యతలు అప్పగించిన 25 రోజుల్లోనే రంగనాథ్ సారథ్యంలోని హైడ్రా టీం 20 కట్టడాలను కూల్చేసింది. దిగ్గజ ప్రముఖులకు చెందిన వారి నుంచి సుమారు 44 ఎకరాల స్థలాన్ని కాపాడింది. నగరంలో చెరువులకు కళ తప్పిన పరిస్థితి నుంచి మురిసేలా మార్చే యత్నంలో రంగనాథ్ పనితీరు అద్భుతమని స్వయంగా ప్రభుత్వ పెద్దలతో పాటు పలువురు ఇతర ప్రముఖులు కూడా కీర్తించడం ఆయన కర్తవ్య నిబద్ధతకు నిదర్శనం. కాగా, హైడ్రా నిర్మాణంతో ప్రత్యేక టీం కూర్పునకు సీఎం అనుమతి ఇవ్వడంతో రంగనాథ్ ప్రణాళిక బద్ధంగా ముందుకు సాగుతున్నారు. ప్రత్యేకంగా పోలీస్ స్టేషన్, సపరేట్ ఆఫీస్ సెటప్ ను ఏర్పాటు చేసుకుని పనులు నిర్వర్తిస్తున్నారు. సంప్రదించాల్సిన వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కేరాఫ్ గా ఓ ప్రాంతం ఉండేలా ఏర్పాట్లు చేశారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments