బీజేపీ యువ నాయకుడు గోగుల రాణా ప్రతాప్ రెడ్డి
ఖానాపురం మండలంలో దెబ్బతిన్న ఇండ్లు, పంటల పరిశీలన
40 నిరుపేద కుటుంబాలకు సాయం అందజేత
స్పాట్ వాయిస్, నర్సంపేట : శనివారం రాత్రి కురిసిన భారీ వడగండ్ల వర్షానికి నియోజకవర్గంలోని చాలా గ్రామాలు అతలాకుతలమయ్యాయి. పలు ఇళ్లు ధ్వంసం కాగా, చేతికి వచ్చిన పంటలు నేలమట్టం అయ్యాయి. విషయం తెలుసుకుని నర్సంపేట నియోజకవర్గ బీజేపీ యువ నాయకుడు గోగుల రాణా ప్రతాప్ రెడ్డి వివిధ గ్రామాల్లో పర్యటించారు. ధ్వంసమైన ఇళ్లను పరిశీలించి 40 నిరుపేద కుటుంబాలకు తన వంతు సాయం అందజేశారు. దెబ్బతిన్న పంటలను పరిశీలించి, నష్టపోయిన రైతులను పరామర్శించారు. ఈ సందర్భంగా రాణా ప్రతాప్ మాట్లాడుతూ ఇళ్లు కోల్పోయిన నిరుపేద కుటుంబాలకు ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు వెంటనే మంజూరు చేయాలని, పంట నష్టపోయిన రైతులకు రాజకీయాలకు అతీతంగా, కాలయాపన చేయకుండా నష్టపరిహారం అందివ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఖానాపూర్ బీజేపీ మండల అధ్యక్షుడు ఆబోతు రాజు, సీనియర్ నాయకులు గడ్డం ఆంజనేయులు, నల్లబెల్లి మండల అధ్యక్షుడు బొద్దిరెడ్డి ప్రతాప్ రెడ్డి, మాజీ మండలాధ్యక్షులు గుడిపూడి రాధాకృష్ణ, లింగాబత్తుల యాకసాయన్న, మండల నాయకులు రాధారపు అశోక్, మండల యూత్ నాయకులు సురేష్, ప్రవీణ్, కక్కెర్ల రవీందర్, దుగ్గొండి మండల నాయకులు పల్లకొండ శ్రీను, బత్తుల బన్నీ , గూడెపు రంజిత్, గోగుల సందీప్ రెడ్డి, రైతులు, యువకులు పాల్గొన్నారు.
Recent Comments