స్పాట్ వాయిస్, వర్ధన్నపేట: మండలంలోని కట్రియాల గ్రామంలో రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని మజిదే ఈ నూర్ ఈద్గా మైదానలో ప్రత్యేక నమాజ్ నిర్వహించారు. ఈ ప్రార్థనల్లో వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నరుకుడు వెంకటయ్య, మాజీ సర్పంచ్ గుజ్జ సంపత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ మార్కెట్ చైర్మన్ నరుకుడు వెంకటయ్య మాట్లాడుతూ.. క్రమశిక్షణ, దాతృత్వం ధార్మికచింతనల కలయికే రంజాన్ మాసమన్నారు. రంజాన్ మాసంలో ముస్లింలు నిష్టతో కూడిన కఠిన ఉపాసం ఉంటారన్నారన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల మైనార్టీ అధ్యక్షుడు, గ్రామ మాజీ ఉప సర్పంచ్ ఎండీ అక్బర్, మండల మాజీ కో-ఆప్షన్ నెంబర్ సయ్యద్ సోఫి, మజీద్ సదర్ సయ్యద్ షబ్బీర్, కుల పెద్దలు మహమ్మద్ ఇబ్రహీం, మహమ్మద్ అంకుస్, మహమ్మద్ చాంద్, మహమ్మద్ జహింగిర్, మహమ్మద్ ఆంకుస్, మహమ్మద్ గుంషా, మహమ్మద్ కరీం, మహమ్మద్ యాకూబ్, మహమ్మద్ యాకూబ్ పాషా పాల్గొన్నారు.
Recent Comments