Friday, November 22, 2024
Homeజిల్లా వార్తలురామప్ప ఆలయ పక్కన గుప్త నిధుల తవ్వకాలు..

రామప్ప ఆలయ పక్కన గుప్త నిధుల తవ్వకాలు..

స్పాట్ వాయిస్ , ములుగు: ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేట గ్రామంలోని యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం పక్కన ఉన్న గొల్లగుడిలో గుర్తుతెలియని వ్యక్తులు గుప్తనిధుల కోసం తవ్వకాలు చేపట్టారు. గుడి పై కప్పును ధ్వంసం చేయడంతో పాటు గుడి లోపల తవ్వకాలు చేపట్టి కొన్ని శిల్పాలను కూడా ధ్వంసం చేశారు. గుడి వద్ద గుర్తు దుండగులు ఉపయో గించిన నిచ్చెనతోపాటు పలు వస్తువులు లభ్యమ య్యాయి. విషయాన్ని ఆలస్యంగా తెలుసుకున్న పురావస్తు శాఖ అధికారులు ఆదివారం వెంకటాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments