Friday, March 7, 2025
Homeతెలంగాణరాజీవ్ పేరో, రాహుల్ గాంధీ పేరో పెట్టొద్దు..

రాజీవ్ పేరో, రాహుల్ గాంధీ పేరో పెట్టొద్దు..

రాజీవ్ పేరో, రాహుల్ గాంధీ పేరో పెట్టొద్దు..
మామునూర్ ఎయిర్ పోర్ట్ కు కాకతీయుల పేరు పెట్టాలి
బీఆర్ఎస్ రాష్ట్ర నేత ఏనుగుల రాకేశ్ రెడ్డి
స్పాట్ వాయిస్, బ్యూరో: మామునూర్ విమానాశ్రయానికి కాకతీయుల పేరు పెట్టాలని, కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలో ఉందని మళ్లీ ఇంకో రాజీవ్ గాంధీ పేరో, రాహుల్ గాంధీ పేరో పెట్టొద్దని బీఆర్ఎస్ రాష్ట్ర నేత ఏనుగుల రాకేశ్ రెడ్డి అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వరంగల్ లో డొమెస్టిక్ చేసి చేతులు దులుపుకోవడం కాదని అంతర్జాతీయ విమానాశ్రయంగా ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద నగరంగా, రెండో రాజధానిగా ఉన్న వరంగల్ లో నిర్మించబోతున్న ఎయిర్ పోర్టు అంతర్జాతీయ స్థాయిలోనే అభివృద్ధి చేయాలన్నారు. డొమెస్టిక్ ఏర్పాటుతో పేరుకే విమానాశ్రయం ఉంటుందని, సర్వీసులు అంతగా ఉండవని అన్నారు. ఆంధ్రప్రదేశ్ లోని కడప, కర్నూల్ వంటి విమానాశ్రయాల్లా పడావు పడే అవకాశం ఉంటుందని చెప్పారు. మామునూర్ ఎయిర్ పోర్ట్ ఎప్పుడో ఏర్పాటు కావాల్సి ఉందని, కానీ నాటి కాంగ్రెస్ ప్రభుత్వం అసంబద్ధమైన వైఖరితో రాజీవ్ంధీ విమానాశ్రయానికి 25 ఏళ్ల పాటు 150 కిలోమీటర్ల పరిధిలో మరో కొత్త ఎయిర్ పోర్టుకు అనుమతివ్వబోమని అంగీకరిస్తూ ఎంవోయూ కుదర్చుకోవడంతో శాపంగా మారిందన్నారు. ఇన్నేళ్లు కాంగ్రెస్ పార్టీ వరంగల్ కు చేసిన పాపాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా చేసి కడుక్కోవాలని సూచించారు. ప్రకటనలు కాకుండా పని కూడా వేగవంతం చేయాలన్నారు. వరంగల్ కు కొత్తగా తెచ్చిన విమానాశ్రయం కాదని, మూత పడేసి పునరుద్ధరణ చేస్తున్న విమానాశ్రయమని ఆయన గుర్తు చేశారు

RELATED ARTICLES

Most Popular

Recent Comments