ఆ సర్టిఫికెట్ లేకున్నా పర్వాలే..
రాజీవ్ యువ వికాసం స్కీంలో కీలక వెసులుబాటు
స్పాట్ వాయిస్, బ్యూరో: రాజీవ్ యువ వికాసం పథకానికి భారీగా దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఈ స్కీంకు దరఖాస్తు చేసుకోవడానికి ఆదాయం సర్టిఫికెట్ అవసరం కావడంతో చాలా మంది మీసేవల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఒకే సారి ఇన్ కం సర్టిఫికెట్ కు భారీగా దరఖాస్తులు చేస్తుండడంతో తహసీల్దార్ కార్యాలయాల్లో సర్వర్ బిజీగా మారింది. ఈ నేపథ్యంలో దరఖాస్తు దారులకు మంచి అవకాశం ఇచ్చింది. ఆదాయం సర్టిఫికెట్ లేకున్నా.. కేవలం రేషన్ కార్డుతో దరఖాస్తు చేయవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. తహసీల్దార్ కార్యాలయాల్లో సర్వర్ బిజీగా మారడంతో ఆదాయం సర్టిఫికెట్ జారీ నెమ్మదించింది. ఆదాయ ధ్రువపత్రాల కోసం దరఖాస్తుదారులకు ఇబ్బందులు తలెత్తుతున్న సందర్భంలో స్పందించిన సర్కారు, తెల్ల రేషన్‌కార్డుతో దరఖాస్తులు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించింది. రేషన్ కార్డులు ఉన్నవారు దరఖాస్తులో నంబరు పొందుపరిస్తే సరిపోతుంది. లేనివారు మాత్రం తప్పకుండా ఆదాయ ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాల్సిందేనని అధికారులు చెబుతున్నారు. ఇక దరఖాస్తుల స్వీకరణ గడువును 14వ తేదీ వరకు పొడిగించింది.
ఆ సర్టిఫికెట్ లేకున్నా పర్వాలే..
RELATED ARTICLES
Recent Comments