బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సస్పెన్షన్..
స్పాట్ వాయిస్, హైదరాబాద్: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై సస్పెన్షన్ వేటు పడింది. బీజేపీ హైకమాండ్ రాజాసింగ్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీచేసింది. పార్టీ నుంచి ఎందుకు బహిష్కరించకూడదో..సెప్టెంబర్ 2లోగా వివరణ ఇవ్వాలని రాజాసింగ్‌ను పార్టీ ఆదేశించింది. అంతేగాక బీజేఎల్పీ పోస్ట్ నుంచి రాజాసింగ్‌ను అధిష్టానం తప్పించింది. సోషల్ మీడియాలో రాజాసింగ్ పోస్టు చేసిన ఒక వీడియో వివాదాస్పదమై వైరల్ కావడంతో దుమారం చెలరేగింది. దీంతో ఒక వర్గం సోమవారం రాత్రి నుంచి ఆందోళనకు దిగింది. అనంతరం ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి.
Recent Comments