స్పాట్ వాయిస్, హైదరాబాద్: మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డి కాంగ్రెస్కు రాజీనామా చేశారు. ఈ మేరకు గురువారం సాయంత్రం ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాకు రాజీనామా లేఖను పంపారు. ఇప్పటికే కాంగ్రెస్కు రాజీనామా చేస్తున్నట్లు రాజగోపాల్రెడ్డి ప్రకటించారు. కాంగ్రెస్లో 30ఏళ్లు సుశిక్షితుడైన కార్యకర్తగా పనిచేశానని వెల్లడించారు. ఏ పని అప్పగించినా రాజీపడకుండా పార్టీ కోసం పనిచేశానని తెలిపారు. కష్టాలను దిగమింగుకుంటూ పార్టీ ప్రతిష్ట కోసం పాటుపడ్డానని వివరించారు.
ఆ వ్యక్తి కింద పనిచేయలేను.. అందుకే రాజీనామా…
30 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో సుశిక్షితుడైన కార్యకర్తగా, ప్రజాప్రతినిధిగా మీ నాయకత్వంలో ఏ పని అప్పగించినా ఎక్కడ రాజీ పడకుండా ప్రస్థానం సాగించాను. కానీ గడిచిన కొంతకాలంగా పార్టీకి పూర్తి విధేయులైన వారిని అడుగడుగునా అవమానపరుస్తూ… విస్మరిస్తూ… పార్టీ ద్రోహులు… మీపైనే వ్యక్తిగత విమర్శలు చేసిన వ్యక్తులకు కీలక బాధ్యతలు అప్పగించటం నన్ను తీవ్రంగా బాధించింది. ఇప్పటికే అనేక పార్టీలు మార్చి, స్వలాభం కోసం ఓ ప్రజాప్రతినిధి చేయకూడని పనులు చేసి జైలు పాలైన వ్యక్తి ఆధ్వర్యంలో నేను కలిసి పనిచేయలేను. అంటూ సోనియా గాంధీ లేఖ రాశారు.
Recent Comments