రైతులకు రుణమాఫీ చేయాలి
– బీజేపీ మండల అధ్యక్షుడు కుడుతాడి చిరంజీవి
స్పాట్ వాయిస్, ఎల్కతుర్తి: సీఎం కేసీఆర్ఆర్ ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన మాట ప్రకారం లక్ష రూపాయల రుణమాఫీ వెంటనే అమలు చేయడంతో పాటుగా కేంద్రం ప్రభుత్వం ప్రవేశపెట్టిన పసల్ బీమా యోజన పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. శుక్రవారం భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఎల్కతుర్తి మండల అధ్యక్షుడు బిట్ల లింగయ్య ఆధ్వర్యంలో శుక్రవారం రైతుల సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. మండలంలోని దామెర, చింతలపల్లి, ఎల్కతుర్తి, ఇందిరానగర్ గ్రామాల్లో పర్యటించి పంట నష్టం వివరాలు తెలుసుకొని, సంతకాలు సేకరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు కుడుతాడి చిరంజీవి పాల్గొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో పసల్ బీమా యోజన పథకాన్ని అమలు చేయకపోవడం వల్ల అకాల వర్షాలతో వరదలతో పంట నష్టపోయిన రైతులు పంట నష్టపరిహారం అందడం లేదన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్లు తెరచి కేంద్రం ప్రభుత్వం ప్రవేశపెట్టిన పసల్ బీమా యోజన పథకాన్ని తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల సీనియర్ నాయకులు కంచర్ల శంకరయ్య, జనగని కిష్టయ్య, ముష్కే వెంకటేష్, మండల ప్రధాన కార్యదర్శి కోరే కార్తిక్, దామెర ఎంపీటీసీ గొర్రె ఆదం, మండల ఉపాధ్యక్షుడు చిదురాల వెంకటేష్, పల్లేపాటి మధుకర్, కిసాన్ మోర్చా జిల్లా నాయకులు గండు సారయ్య, పెద్ది కిషన్ రెడ్డి, గట్టు రాజమౌళి, ఎర్రోళ్ల రాజు, ముస్కె కుమార స్వామి, సోలంకి రాజేశ్వర రావు, పోగుల ప్రశాంత్, పుట్ట కనుకయ్య, రగొత్తమ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Recent Comments