మండె ఎండల్లో వానలు..
ఏప్రిల్ 02 నుంచి 4 రోజులపాటు వర్షాలు..
వెల్లడించిన వాతావరణ శాఖ
స్పాట్ వాయిస్, బ్యూరో: మండె ఎండల్లో హాయినిచ్చే న్యూస్. ప్రస్తుతం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మండే ఎండలు, తీవ్రమైన వడగాల్పుల కారణంగా ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.అయితే వాతావరణ శాఖ రాష్ట్ర ప్రజలకు చల్లటి కబురు చెప్పింది. ఇప్పటికే ఏపీలోని పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు తెలంగాణకు కూడా వర్ష సూచన ఉందని అధికారులు చెబుతున్నారు. తెలంగాణలో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఏప్రిల్ 02 నుంచి 4 రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని చెబుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మహబూబ్‌నగర్, హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, జగిత్యాల, సిరిసిల్ల, సంగారెడ్డి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లోని ఆయా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇదే క్రమంలో వడగాల్పుల తీవ్రత తగ్గి ఉష్ణోగ్రతలు 2-4 డిగ్రీల వరకు పడిపోవచ్చని అంచనా వేస్తున్నారు. వర్షాలతో పాటు పిడుగుల ప్రమాదం ఉండే అవకాశం కూడా ఉందని అధికారులు చెబుతున్నారు.
మండె ఎండల్లో వానలు..
RELATED ARTICLES
Recent Comments