రానున్న మూడు రోజులు వర్షాలు..
అలెర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ
ఇప్పటికే మొదలైన గాడ్పులు
స్పాట్ వాయిస్, బ్యూరో: ఎండలు దంచికొడుతున్నాయి. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయి. అయితే ఉత్తర, ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో శుక్ర, శని, ఆదివారాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉరుములు, మెరుపులతో పాటు వడగండ్ల వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. అంతేకాదు.. పలు జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. ద్రోణి ప్రభావంతో వర్షాలు కురుస్తాయని.. గరిష్ఠ ఉష్ణోగ్రతలు తగ్గుతాయని పేర్కొంది. శుక్రవారం ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, ఆసిఫాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, వడగళ్లతో కూడిన వర్షాలు పడుతాయని.. ఈ సమయంలో గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేయగా.. నిర్మల్, నిజామాబాద్, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఆదివారం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లో అక్కడక్కడ వడగళ్ల వానలు పడుతాయని పేర్కొంది. మరికొన్ని ఉరుములు, మెరుపులతో పాటు పెనుగాలులు వీస్తాయని హెచ్చరించింది.
రానున్న మూడు రోజులు వర్షాలు..
RELATED ARTICLES
Recent Comments