పలు చెరువులకు గండి..
ఇళ్లల్లోకి చేరుతున్న నీరు..
భయాందోళనలో ప్రజలు
కలెక్టరేట్ లో కంట్రోల్ రూం
స్పాట్ వాయిస్, భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి నీటి పై తేలియాడుతోందో. శనివారం మొదలైన వర్షం ఇప్పటికీ జోరుగా పడుతుండడంతో గ్రామాలన్నీ నీటిలో నే ఉన్నాయి. ఇప్పటికే వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించగా.. చెరువులు ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. మల్హర్ మండలంలో రుద్రారం చెరువు కట్ట పై నుంచి వరద నీరు పారుతుండడంతో తహసీల్దార్ జేసీబీతో గండిపెట్టారు. అలాగే కాటారం మండలం వీరాపూర్ గ్రామ చెరువుకు గండి పడింది.
ఇక జిల్లాలో ని రోడ్లపై ఉన్న లో లెవల్ వంతెనల్లో ఉధృతం గా వరద నీరు పరగులు తీస్తోంది. ఇక గోదావరిలో వరద నీరు భారీగా వస్తుండడంతో కాళేశ్వరం ప్రాజెక్టు గేట్లు అన్ని ఎత్తి నీటిని కిందికి వదులుతున్నారు. మోరంచ వాగు పరుగులు తీస్తోంది. రేపు సైత అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉండగా… ఇప్పటికే ప్రమాదకరంగా మారిన చెరువు లు, ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులను చూస్తూ జనం వణికిపోతున్నారు.
జిల్లావ్యాప్తంగా కుండపోత వర్షం కురుస్తున్న నేపథ్యంలో… అధికారులు భూపాలపల్లి కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. ప్రజలు 90306 32608 నంబర్‌ను సంప్రదించవచ్చని తెలిపారు.
Recent Comments