Saturday, May 3, 2025
Homeజిల్లా వార్తలుఅకాల వర్షాలతో రైతు ఆగం

అకాల వర్షాలతో రైతు ఆగం

అకాల వర్షాలతో రైతు ఆగం

 పంట నష్టంతో ప్రభుత్వ సాయం కోసం ఆవేదన

స్పాట్ వాయిస్, గణపురం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండల కేంద్రానికి చెందిన గుర్రం తిరుపతి గౌడ్ అనే రైతు తన కుటుంబ జీవనోపాధి కోసం అప్పులు తెచ్చి 10 ఎకరాల భూమిని కౌలుకు తీసుకున్నాడు. వరి సాగు చేసేందుకు అప్పులు తెచ్చి విత్తనాలు, ఎరువులు, కూలీల ఖర్చులతో పంట వేశాడు. పంట దిగుబడి బాగుంటుందని, అప్పులు తీర్చి కొంత లాభం సంపాదిస్తామని ఆశించిన తిరుపతి జీవితం, రెండు రోజులుగా కురిసిన అకాల వర్షాలతో ఒక్కసారిగా చీకటిమయమైంది. గాలివాన బీభత్సానికి 10 ఎకరాల్లోని వరి పంట మొత్తం నేలవాలి నీట మునిగింది. దీంతో తిరుపతి తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాడు. నేను రాత్రింబవళ్లు కష్టపడి పంట వేశాను. అన్నీ అప్పుల మీదే చేశాను. ఇప్పుడు పంట పోయింది, అప్పు తీర్చే మార్గం లేదు. ప్రభుత్వం సాయం చేయకపోతే మా కుటుంబం రోడ్డున పడుతుందని గుర్రం తిరుపతి కన్నీటితో వాపోయాడు. అకాల వర్షాల వల్ల నాలాగే నష్టపోయిన రైతులందరికీ తక్షణ ఆర్థిక సాయం చేయాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాడు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments