స్పాట్ వాయిస్, గణపురం: నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి జయశంకర్ భూపాలపల్లి జిల్లా అస్తవ్యస్తo అయిoది. మోరంచ వాగు ఉగ్ర రూపానికి మోరంచపల్లి గ్రామం పూర్తిగా నీట మునిగింది. భూపాలపల్లి-పరకాల ప్రధాన రహదారి పై మొరంచపల్లి వద్ద సుమారు 15 ఫీట్స్ ఎత్తులో మోరంచ వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీనితో 353సీ జాతీయ రహదారి పై రవాణా పూర్తిగా నిలిచి పోయింది. ఎగువన గణప సముద్రం 5 ఫీట్లు మేర మత్తడి పడుతోoది. దీంతో భారీగా వచ్చే నీటితో మోరంచపల్లి గ్రామం జలదిగ్బంధంలో చిక్కుకుంది.అయితే బుధవారం రాత్రి నుంచి ఇళ్లలోకి నీరు చేరుతుండటంతో గ్రామస్థులు బస్టాండ్ ఆవరణలో ఉన్న ఓ బిల్డింగ్ పైకి ఎక్కి వర్షంలో భయం గుప్పిట్లో గడుపుతున్నారు. కేవలం హెలికాప్టర్ ద్వారానే ఆ ప్రాంతానికి చేరుకునే అవకాశాలు ఉన్నాయి.జిల్లా ఉన్నతధికారులు తక్షణమే స్పందించి సహాయక చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.
Recent Comments