Sunday, November 17, 2024
Homeతెలంగాణఅయ్యో రైతన్న..

అయ్యో రైతన్న..

అయ్యో రైతన్న..

స్పాట్ వాయిస్, మల్హర్: వర్షాలు లేక రైతులు అల్లాడిపోతున్నారు. పెట్టిన విత్తనాలను కాపాడుకోవడానికి అష్టకష్టాలు పడుతున్నారు. తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో జయశంకర్ భూపాల పల్లి జిల్లా మల్హర్ మండలంలోని కొండంపేట గ్రామ పంచాయతీ కుంభంపల్లి గ్రామానికి చెందిన కుంభం తిరుపతి – లత దంపతులు తమ 20 గుంటల చేనులో పెట్టిన అలిశంత,బీర మొక్కలను కాపాడుకోవడానికి బిందెలతో నీళ్లు పోస్తున్నారు. వర్షాలు కురవకపోవడంతో పెట్టిన గింజలు మొలకెత్త కుండా పోతాయోనని..అలాగే అక్కడ అక్కడ మొలకెత్తిన గింజలు ఎండ వేడికి చనిపోకుండా బిందెలతో నీళ్లు పోస్తున్నారు. సమీపంలోని ఇంటి దగ్గరి నుంచి బిందెలు, క్యాన్ లలో నీళ్లు తీసుకువచ్చి మొక్కలకు పోస్తున్నట్టు వారు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments