దంచికొడుతున్న వాన..
వరద నీటిలో హన్మకొండ, వరంగల్..
రైతులకు కోలుకొని దెబ్బ..
స్పాట్ వాయిస్, బ్యూరో : తెలంగాణవ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. మూడు రోజులుగా ఈదురుగాలులతో వడగళ్లవానలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే రాగల ఐదు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఎల్లో అలెర్జ్ జారీ చేసింది. ఇక ఆదివారం సాయంత్రం.. హన్మకొండ, వరంగల్ జిల్లాల్లో వర్షం కురిసింది. ఇప్పటికే రైతులు భారీగా నష్ట పోగా.. ఈ వర్షo మరింత దెబ్బ తీసింది. ఇక హన్మకొండ, వరంగల్ పట్టణo లోని లోతట్టు ప్రాంతాలు.. వరద నీటిలో చిక్కుకున్నాయి.
వర్షాలు ఇలా..
ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకు ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, భూపాలపల్లి, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
సోమవారం నుంచి మే 4వ తేదీ వరకు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని, మరికొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు చెప్పింది. ఈ మేరకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఆదివారం కరీంనగర్, రాజన్న సిరిసిల్లతో పాటు పలు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాపాతం నమోదైంది.
Recent Comments