Friday, November 22, 2024
Homeజనరల్ న్యూస్అకాల వర్షం.. పంటలన్నీ ఆగమాగం..  

అకాల వర్షం.. పంటలన్నీ ఆగమాగం..  

అకాల వర్షం.. పంటలన్నీ ఆగమాగం..  

ఈదురు గాలులతో కరంట్ సరఫరాకు అంతరాయం

స్పాట్ వాయిస్, కమలాపురం: శనివారం రాత్రి ఇదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. కొన్ని చోట్ల వడగండ్ల వాన పడడంతో పంటలు దెబ్బతిన్నాయి. కల్లాల్లో ఉంచిన ధాన్యం తడిసింది. తీవ్రమైన గాలివానకు భారీ వృక్షాలు నేలకొరిగాయి., పలుచోట్ల విద్యుత్ స్తంభాలు విరిగిపోగా సరఫరాకు అంతరాయం కలిగింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మరిపెడ, పరకాల, చిట్యాల, మొగుళ్లపల్లి, దామెర, కమలపురం, ములుగు తదితర మండలాల్లో వర్షం కురిసింది. పలుచోట్ల వడగళ్లు పడడంతో ఆస్తినష్టం జరిగింది.

*రాలిన మామిడి

హనుమకొండ జిల్లా.. కమలాపూర్ మండలంలో రాత్రి ఈదురుగాళ్లతో కురిసిన భారీ వడగళ్ల వాన అతలాకుతలం చేసింది. పంటలు చేతికొచ్చే దశలో ధాన్యం, మొక్కజొన్న, మామిడి రాళ్లవానకు నేలకొరిగాయి. వడగళ్ల వాన రైతులను కష్టాల పాలు చేసింది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments