ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
వైస్ ఎంపీపీ జాకీర్ అలీ,
సర్పంచ్ సత్యనారాయణ రెడ్డి
స్పాట్ వాయిస్ దామెర: రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని దామెర వైస్ ఎంపీపీ జాకీర్ అలీ, సర్పంచ్ సత్యనారాయణ రెడ్డి సూచించారు. ఆదివారం పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆదేశాల మేరకు మండలం లోని ఊరుగొండ గ్రామంలో వైస్ ఎంపీపీ జాకీర్ అలీ సర్పంచ్ గోగుల సత్యనారాయణ రెడ్డితో కలిసి గ్రామంలో పర్యటించారు. వర్షం కారణంగా కూలిపోయే ప్రమాదం ఉన్న ఇండ్లను గుర్తించి,వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ సందర్భంగా భారీ వర్షాల పట్ల తీసుకోవల్సిన జాగ్రత్తలను ప్రజలు వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ గండు సుదర్శన్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Recent Comments