Saturday, September 21, 2024
Homeజాతీయంటీఆర్ఎస్‌తో పొత్తుపై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు

టీఆర్ఎస్‌తో పొత్తుపై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు

స్పాట్ వాయిస్, హైదరాబాద్: టీఆర్ఎస్ తో పొత్తుపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం జోడో యాత్ర కొత్తూరుకు చేరుకున్న సందర్భంగా ఆయన మాట్లాడారు. రాజ్యాంగ వ్యవస్థలను నాశనం చేస్తున్నారని రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు. బీజేపీ, టీఆర్ఎస్‭లు ఒకరిద్దరికే కాంట్రాక్టర్లు కట్టబెడుతున్నాయని ఆరోపించారు. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల వల్లే యువతకు ఉపాధి అవకాశాలు కరువయ్యాయని ఆయన ఆరోపించారు. ఫిట్నెస్ కోసం అయితే జిమ్ చేస్తే సరిపోతుంది.. పాదయాత్ర చేయాల్సిన పనిలేదన్నారు. దేశ మనుగడ కోసం భారత్ జోడో యాత్ర చేస్తున్నామని అన్నారు. రాజకీయం, ఎన్నికల కోసం యాత్ర చేయడం లేదన్న ఆయన.. ప్రజల మధ్య సోదర భావం పెంచేందుకే చేస్తున్నామని చెప్పారు. మరోవైపు ఓబీసీ చేపట్టిన జనాభా లెక్కల గణాంకాలను బహిరంగ పరచాలని రాహుల్ గాంధీ అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ఎన్నికలు నిర్వహించిన తర్వాతే.. ఏఐసీసీ ప్రెసిడెంట్‌ను ఎన్నుకుందని రాహుల్ గాంధీ అన్నారు. కాంగ్రెస్ ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరిస్తోందని.. ఇతర పార్టీల్లో ఆ ప్రజాస్వామ్యం లేదని ఆయన విమర్శించారు. అవినీతి సొమ్ముతోనే బీజేపీ టీఆర్ఎస్‭లు.. ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నాయని రాహుల్ ఆరోపించారు. ఇక పొత్తుపై ప్రస్తావించిన ఆయన.. టీఆర్ఎస్‭తో పొత్తు ఉండదని తేల్చి చెప్పారు. తెలంగాణ సీఎం జాతీయ పార్టీ, అంతర్జాతీయ పార్టీ పెట్టుకోవచ్చన్నారు. అయితే ప్రస్తుతం దేశాన్ని విడగొట్టే వాళ్ళు, జోడించే వాళ్ల మధ్యే పోటీ జరుగుతోందన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments