Monday, November 25, 2024
Homeలేటెస్ట్ న్యూస్స్పాట్ బ్రేకింగ్: రాహుల్‌ను రానివ్వాలి..

స్పాట్ బ్రేకింగ్: రాహుల్‌ను రానివ్వాలి..

ఓయూ వీసీకి హైకోర్ట్ ఆదేశం
స్పాట్ వాయిస్, హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులతో ముఖాముఖికి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని అనుమతించాలని హైకోర్టు వైస్ చాన్స్ లరను ఆదేశించింది. ఈ మేరకు కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఓయూలో రాహుల్ సభకు అనుమతించాలని కోరుతూ.. బుధవారం రెండోసారి ఓయూ జేఏసీ నాయకులు హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ పై వాదనలు విన్న హైకోర్టు.. రాహుల్ సభకు అనుమతించాలని వీసీని ఆదేశించింది. ఈ నెల ఏడో తేదీన ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులతో రాహుల్ గాంధీ ఇంటరాక్షన్ కు కాంగ్రెస్ ప్లాన్ చేసింది. అయితే.. ఈ సమావేశానికి ఉస్మానియా యూనివర్సిటీ వీసి అనుమతి నిరాకరించారు. దీంతో ఓయూ జేఏసీ.. హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై వాదనలు విన్న హైకోర్టు.. అంశాన్ని పరిశీలించాలని వీసీకి సూచించింది. అప్పటికే వీసీ అనుమతి నిరాకరించడంతో.. మరోసారి హౌస్ మోషన్ పిటిషన్ వేశారు. వాదనలు విన్న కోర్టు.. సభకు అనుమతించాలని వైస్ ఛాన్స్ లర్ కు ఆదేశాలిచ్చింది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments