ఒంటరి జీవితాన్ని భరించలేక..
వృద్ధుడి ఆత్మహత్య…
స్పాట్ వాయిస్, రఘునాథపల్లి :ఒంటరి తనాన్ని భరించలేక ఓ వృద్దుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన భూపాలపల్లి జిల్లా మహాదేవ్‌పూర్ గ్రామ శివారులో చోటుచేసుకుంది. స్థానిక ఎస్‌ఐ పవన్‌కుమార్ కథనం ప్రకారం.. జనగామ జిల్లా రఘునాథపల్లి గ్రామానికి చెందిన వృద్దుడు బలిజే చంద్రయ్య భార్య కొద్ది రోజుల క్రితం చనిపోయింది. బార్య తోడు లేని ఒంటరి జీవితాన్ని భరించలేక జీవితంపై విరక్తి పుట్టిన చంద్రయ్య మహదేవ్‌పూర్ శివారులోని నర్సరి పక్కన చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. మృతుడి కుమారుడు జితేందర్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
Recent Comments