ఆంధ్ర నుంచి ఖరారు..
స్పాట్ వాయిస్, బ్యూరో: బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్యను రాజ్యసభ అభ్యర్థిగా ఎంపిక చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ర్టం నుంచి వైఎస్సార్ సీపీ కృష్ణయ్యను ప్రతిపాదించారు. ఏపీలో ఖాళీ అయిన నాలుగు రాజ్యసభ స్థానాల్లో అభ్యర్థులను మంగళవారం ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో కలిసి మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య, న్యాయవాది నిరంజన్ రెడ్డి, బీద మస్తాన్‌రావును అభ్యర్థులుగా ఖరారు చేశారు. అలాగే ఎంపీ విజయసాయిరెడ్డికి మరోసారి అవకాశం కల్పించారు. ఏపీ సీఎం జగన్ బీసీలకు 44 శాతం రిజర్వేషన్లు కల్పించారని ఆర్.కృష్ణయ్య తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న బీసీల కోసమే తాను పోరాడుతున్నట్లు తెలిపారు. బీసీల పోరాటం అనేది తెలంగాణకు మాత్రమే పరిమితమైనది కాదని స్పష్టం చేశారు. బీసీ వర్గాలకు తాను చేస్తున్న సేవను గుర్తించి ఏపీ సీఎం జగన్ అవకాశం ఇచ్చారని తెలిపారు.
Recent Comments