Friday, April 18, 2025
Homeజిల్లా వార్తలుఆసుపత్రి నిర్మాణంలో నాణ్యత పాటించాలి

ఆసుపత్రి నిర్మాణంలో నాణ్యత పాటించాలి

కేంద్రం నిధులను దుర్వినియోగం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి
స్పాట్ వాయిస్, నర్సంపేట : నర్సంపేట పట్టణంలో నిర్మిస్తున్న 250 పడకల జిల్లా ఆస్పత్రి నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని నియోజకవర్గం బీజేపీ నాయకుడు రేవూరి ప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం ఆయన నర్సంపేట పట్టణంలో నిర్మాణంలో ఉన్న ఆసుపత్రి భవనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులతో రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న జిల్లా ఆస్పత్రి నిర్మాణంలో ఎటువంటి నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదని ఆరోపించారు. ప్రజల అవసరార్థం నిర్మిస్తున్న ఆసుపత్రి పనుల్లో నాణ్యత పాటించకపోతే భవిష్యత్ లో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు. భవన నిర్మాణం నాసిరకంగా, నిర్లక్ష్య ధోరణితో నిర్మిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ఆరోగ్య మంత్రికి చిత్తశుద్ధి ఉంటే టెక్నికల్ బృందంతో ఆసుపత్రి నిర్మాణ పనులను తనిఖీ చేయించి నిజాయితీ నిరూపించుకోవాలని రేవూరి ప్రకాశ్ రెడ్డి డిమాండ్ చేశారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments