Friday, September 27, 2024
Homeలేటెస్ట్ న్యూస్మహానగరంలో భారీ కొండ చిలువ

మహానగరంలో భారీ కొండ చిలువ

గ్రేటర్ కార్పొరేషన్ పక్కనే కలకలం..
స్పాట్ వాయిస్, వరంగల్: వరంగల్ నడిబొడ్డుపై కొండ చిలువ కలకలం సృష్టించింది. సాక్షాత్తు గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ సమీపంలోనే హడల్ సృష్టించింది. గురువారం రాత్రి భారీ కొండ చిలువ కనిపించడం కలకలం రేపింది. మహానగర మున్సిపాలిటీ పక్కనే వినాయక విగ్రహాల తయారీ కేంద్రంలో భారీ కొండ చిలువ ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు, అటవీశాఖ అధికారులు సమాచారం అందించారు. వెంటనే అక్కడకు చేరుకున్న అటవీశాఖ అధికారులు స్నేక్ క్యాచర్లు కొండ చిలువను బంధించి సురక్షితంగా హన్మకొండ జంతు ప్రదర్శనశాలకు తరలించినట్లు సమాచారం. దాదాపు 15 అడుగులు ఉన్న కొండ చిలువ గతంలో అనేక సార్లు స్థానికులకు కనిపించిందని చెబుతున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments