పెరిగిన విద్యుత్ చార్జీలు
డొమెస్టిక్ పై రూ.40-50 పైసలు
కమర్షియల్ పై రూపాయి పెంపు
ధరాఘాతంతో తలలు పట్టుకుంటున్న పేదలు
స్పాట్ వాయిస్, హైదరాబాద్: తెలంగాణలో విద్యుత్ ఛార్జీల పెంపు ఖరారైంది. 14 శాతం విద్యుత్ ఛార్జీలను పెంచేందుకు టీఎస్ ఈఆర్సీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు బుధవారం అధికారిక స్పష్టత వచ్చింది. పెరిగిన ఛార్జీల ప్రకారం.. డొమెస్టిక్(గృహోపయోగ విద్యుత్తు వాడకం) పై 40-50 పైసలు పెంపు వర్తించనుంది. ఇతర కేటగిరీలపై యూనిట్‌కు రూపాయి చొప్పున భారం పడనుంది. అయితే గతంలోనే పెంపునకు సంబంధించిన ప్రతిపాదనలు ఇచ్చిన డిస్కంలు.. 19 శాతం పెంపునకు అనుమతి కోరాయి. కానీ, ఈఆర్సీ మాత్రం 14 శాతానికే అనుమతి ఇచ్చింది. డిస్కమ్‌లకు 10వేల కోట్ల రూపాయల ద్రవ్యలోటు ఉన్నట్లు డిసెంబర్ నెలలోనే నివేదికలు సమర్పించకగా.. ఛార్జీలు పెంచకతప్పదనే సంకేతాలు ఆ టైంలోనే అందించాయి. సుమారు ఏడేళ్ల తర్వాత విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనలు ఇవ్వగా.. సూత్రప్రాయంగా విద్యుత్ నియంత్రణ మండలి టీఎస్ ఈఆర్సీ అంగీకరించినట్లు సమాచారం.
Recent Comments