Sunday, May 19, 2024
Homeసినిమాపుష్ప.. సాలిడ్ గెటప్..

పుష్ప.. సాలిడ్ గెటప్..

తగ్గేదేలే.. అన్నట్లుగా పార్ట్ -2
స్పాట్ వాయిస్, డెస్క్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో లేటెస్ట్ గా తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియన్ మూవీ పుష్ప-2. రష్మిక మందన్న హీరోయిన్. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ టీజర్ బన్ని పుట్టిన రోజు సందర్భంగా శుక్రవారం రిలీజ్ చేశారు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంటోంది. అయితే విషయం ఏమిటంటే, ఈ మూవీ నుంచి అల్లు అర్జున్ డిఫరెంట్ లుక్ లో ఉన్న పోస్టర్ మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. తిరుపతి లో జరిగే గంగమ్మ జాతర లో భాగంగా సినిమాలో వచ్చే సన్నివేశంలో అల్లు అర్జున్ ఈ డిఫరెంట్ గెటప్ లో కనపడనున్నారని టాలీవుడ్ బజ్. అయితే నిజంగా ఈ పోస్టర్ ముందుగా సోషల్ మీడియాలో లీక్ కావడంతో టీమ్ అఫీషియల్ గా రిలీజ్ చేసింది. ప్రస్తుతం ఈ లుక్ అందరినీ ఆకట్టుకుంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. మొత్తంగా పుష్ప 2 ఒక్కసారిగా అందరిలో విపరీతంగా అంచనాలు పెంచేసింది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments