ఆ నలుగురు పరమ పవిత్రులు ఎలా..?
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు..
ఎమ్మెల్యే ఈటల రాజేందర్
స్పాట్ వాయిస్, హైదరాబాద్: ఎమ్మెల్యేల కొనుగోళ్లంటే కేసీఆర్ అని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విమర్శించారు. శనివారం హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. 2014 నుంచి టీఆర్ఎస్ సర్కార్ పరిపాలనపై కేసీఆర్ తనతో చర్చకు రావాలని సవాల్ విసిరారు. ప్రజాస్వామ్యంపై సీఎం కేసీఆర్‌వి మొసలి కన్నీళ్లని అన్నారు. నలుగురు ఎమ్మెల్యేలు పరమ పవిత్రులు ఎలా అవుతారో కేసీఆర్ ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. హుజూరాబాద్‌లో జరిగిందే మునుగోడులో జరుగుతుందని స్పష్టం చేశారు. ఉప ఎన్నిక నిర్వహణలో ఎన్నికల కమిషన్ విఫలమైందన్నారు. ఓటమి భయంతోనే మునుగోడులో టీఆర్ఎస్ హింసను ప్రేరేపించిందని ఆయన ఆరోపించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు స్వయంగా మునుగోడులో ఓటుకు నోట్లు పంచారన్నారు. దళిత ముఖ్యమంత్రిని చేస్తానన్న కేసీఆర్.. మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను అవమానించారని అన్నారు. టీఆర్ఎస్‌కు ఓటు వేయకుంటే.. పథకాలు రావని మంత్రి హెచ్చరించడం దారుణమని మండిపడ్డారు. ఓడిపోయిన ఎమ్మెల్యేలతో నియోజకవర్గాల్లో అధికారిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు. కేసీఆర్ హాయాంలో ప్రజాస్వామ్య ఖూనీ అయిందని తెలిపారు. తెలంగాణ సంస్కృతి, ఆత్మగౌరవాన్ని సీఎం కేసీఆర్ మంట గలిపారని మండిపడ్డారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను టీఆర్ఎస్‌లో ఎలా చేర్చుకున్నారో చెప్పాలన్నారు. కేసీఆర్ చెప్పే మాటలకు, చేతలకు పొంతన లేదని ఈటల రాజేందర్ మండిపడ్డారు.
కొనుగోళ్లంటే కేసీఆర్
RELATED ARTICLES
Recent Comments