Tuesday, December 3, 2024
Homeజిల్లా వార్తలుఉపాధ్యాయుల సంక్షేమమే పీఆర్టీయూ ధ్యేయం..

ఉపాధ్యాయుల సంక్షేమమే పీఆర్టీయూ ధ్యేయం..

ఉపాధ్యాయ సంఘాల్లో చిచ్చు పెడితే ఊరుకునేది లేదు..
సంఘం రాష్ట్ర ప్రచార కార్యదర్శి మన్నె చంద్రయ్య పటేల్, ఆర్థిక కార్యదర్శి పులి దేవేందర్ ముదిరాజ్
స్పాట్ వాయిస్, వరంగల్: ఉపాధ్యాయుల సంక్షేమమే పీఆర్టీయూ ధ్యేయమని సంఘం రాష్ట్ర ప్రచార కార్యదర్శి మన్నే చంద్రయ్య పటేల్, రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి పులి దేవేందర్ ముదిరాజ్ అన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆదివారం పీఆర్టియు తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. అనంతరం కాళోజీ సాక్షిగా పీఆర్టీయూ రాష్ట్ర ప్రచార కార్యదర్శి మన్నే చంద్రయ్య పటేల్ మాట్లాడుతూ.. సంఘ సమావేశంలో ఓడిన వ్యక్తి సంఘంలో చీలికలు ఏర్పాటు చేసి సంఘం నాది అనే ధోరణితో వ్యవహరిస్తున్నాడన్నారు. ఆయనకిదే హెచ్చరిక అని.., ఎన్నో ఉద్యమాలు చేసిన పోరుగడ్డ ఓరుగల్లు బిడ్డల సాక్షిగా సంఘం కోసం గత పది ఏళ్లుగా కష్టపడ్డామని, అలాంటి మమ్మల్ని కదిపారో జాగ్రత్త సంఘద్రోహుల్లారా అన్నారు. అనంతరం రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి పులి దేవేందర్ ముదిరాజ్ మాట్లాడుతూ ఇటీవల కాలంలో రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉపాధ్యాయులను మభ్యపెడుతూ భయభ్రాంతులకు గురి చేస్తూ, తమకు అధికార పార్టీ నాయకుని అండదండ ఉందని ప్రగల్భాలు పలుకుతూ పోలీస్ స్టేషన్ లో కేసులు పెడతామని అనడం సిగ్గుచేటన్నారు. అలాంటి స్టేషన్ లు ఎన్నో చూశామని ఊక దంపుడు ఉపన్యాసాలు కాదు దమ్ముంటే ఎదురుగా మాట్లాడాలని సవాల్ విసిరారు. సంఘం కోసం గత పది సంవత్సరాలుగా సేవలు చేశామని, రాజకీయాలు చేసే లక్షణం తమది కాదు ఉపాధ్యాయుల శ్రేయస్సు కోసమే పని చేస్తామన్నారు. తమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చెన్నయ్య, ప్రధాన కార్యదర్శిగా అబ్దుల్ వ్యవహరిస్తున్నారని, వారి ఆధ్వర్యంలో సంఘ శ్రేయస్సుకోసం పని చేస్తామని చెప్పారు. అనంతరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రావులకార వెంకటేశ్ మాట్లాడుతూ ఉపాధ్యాయుల శ్రేయస్సు కోసం మాత్రమే పనిచేస్తామని, రాజకీయాలు చేయడం తమ లక్షణం కాదన్నారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు రాచర్ల శ్రీనివాస్., హన్మకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి దావు రమేష్ , జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఉపాధ్యక్షులు మేకల సంతోష్, రాజు, కుమార్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.


అనంతరం ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లక్నోలో జరుగుతున్న అఖిలభారత ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య ( ఏఐఎఫ్టీవో ) జనరల్ కౌన్సిల్ సమావేశాలకు తెలంగాణ రాష్ట్రం నుండి యూనియన్ ప్రతినిధిగా ప్రతినిధిగా వెళ్తున్న భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు రాచర్ల శ్రీనివాస్ ను సన్మానించి సెండ్ ఆఫ్ ఇచ్చారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments