స్పాట్ వాయిస్, హైదరాబాద్: ప్రభుత్వం టీచర్ల పదోన్నతులు, బదిలీల ప్రక్రియను ఈనెల 27 నుంచి చేపట్టేందుకు సిద్ధమైంది. ఈ మేరకు సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు శుక్రవారం ఉపాధ్యాయుల ప్రమోషన్లు, బదిలీలకు సంబంధించి మంత్రి సబితా ఇంద్రారెడ్డి బషీర్బాగ్లోని విద్యాశాఖ కార్యాలయంలో విద్యాశాఖ కార్యదర్శి వాకటి కరుణ, పాఠశాల విద్యా డైరెక్టరేట్ దేవసేన, ఇతర అధికారులతో సమీక్షించారు. ఈ నెల 27 నుంచి బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియను ప్రారంభించాలని, పారదర్శకంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. సమగ్ర షెడ్యూల్ ను వెంటనే విడుదల చేయాలని మంత్రి ఆదేశించారు.
Recent Comments