Friday, November 15, 2024
Homeకెరీర్బీసీలకు ఫ్రీ కోచింగ్.. విత్ స్టై ఫండ్

బీసీలకు ఫ్రీ కోచింగ్.. విత్ స్టై ఫండ్

స్పాట్ వాయిస్, ఎడ్యుకేషన్: ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న బీసీ అభ్యర్థుల‌కు బీసీ సంక్షేమ శాఖ ద్వారా ఉచిత కోచింగ్ ఇవ్వనున్నట్లు బీసీ సంక్షేమ మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్ పేర్కొన్నారు. ఉచిత కోచింగ్ పొందాల‌నుకునే అభ్యర్థుల కోసం రిజిస్ట్రేష‌న్ల ప్రక్రియ‌ను మంత్రి బుధ‌వారం ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి క‌మ‌లాక‌ర్ మాట్లాడుతూ.. బుధవారం నుంచి ఈ నెల 16వ తేదీ వ‌ర‌కు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేష‌న్ చేసుకోవాల‌ని సూచించారు. అదే రోజు ఆన్‌లైన్‌లో ఎంపిక ప‌రీక్ష నిర్వహించి తుది జాబితాను ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు. 21 నుంచి కోచింగ్ ప్రారంభ‌మ‌వుతుంద‌ని తెలిపారు. మొత్తం 16 స్టడీ స‌ర్కిళ్లలో 25 మందికి చొప్పున ఆఫ్‌లైన్ క్లాసులు ఉంటాయని చెప్పారు. మ‌రో 50 వేల మందికి ఆన్‌లైన్ ద్వారా త‌ర‌గ‌తులు నిర్వహిస్తామ‌ని మంత్రి పేర్కొన్నారు. వార్షిక ఆదాయం రూ. 5 ల‌క్షల లోపు ఉన్న అభ్యర్థుల‌కు ఉచిత కోచింగ్ అందించనున్నట్లు మంత్రి చెప్పారు. గ్రూప్ -1, గ్రూప్-2 కోచింగ్‌కు ఎంపిక‌య్యే 10 వేల మంది అభ్యర్థుల‌కు స్టైఫండ్ ఇస్తామ‌ని పేర్కొన్నారు. గ్రూప్-1 అభ్యర్థుల‌కు ఆరు నెల‌ల పాటు రూ. 5 వేల చొప్పున‌, గ్రూప్-2 అభ్యర్థుల‌కు 3 నెల‌ల పాటు నెల‌కు రూ. 2 వేల చొప్పున స్కాలర్ షిప్ ఇస్తామని మంత్రి పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments