Saturday, April 19, 2025
Homeజిల్లా వార్తలుఖానాపురం మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా శాఖమూరి హరిబాబు

ఖానాపురం మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా శాఖమూరి హరిబాబు

స్పాట్ వాయిస్, నర్సంపేట(ఖానాపురం): మండల కాంగ్రెస్ కమిటీని ఆదివారం ఎన్నుకున్నారు. మండల కేంద్రంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడిగా శాఖమూరి హరిబాబు, కార్యనిర్వాహక అధ్యక్షులుగా ఇట్టి సారంగపాణి, గోనెరవీందర్, ఉపాధ్యక్షుడిగా మారబోయిన రాములు, గుగులోతు జగన్, ప్రధాన కార్యదర్శిగా పొడుపు గంటి మధుసూదన్ రావు, సహాయ కార్యదర్శిగా మీసం రవీందర్, జంగిలి రాజ్ కుమార్, కోశాధికారిగా మచ్చ వెంకన్నను ఎన్నుకున్నారు. ఈ సందర్బంగా పీసీసీ సభ్యుడు సొంతిరెడ్డి రంజిత్ రెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రతీ గడపకూ తీసుకెళ్లి, రాబోయే రోజుల్లో పార్టీని బలోపేతం చేసేందుకు నూతన కమిటీతో పాటు ప్రతీ కార్యకర్త శక్తివంచన లేకుండా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, నెక్కొండ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు యడ్ల జగన్మోహన్ రెడ్డి, మండల ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments