స్పాట్ వాయిస్, కాటారం: కాటారం ట్రస్మా ఏరియా కమిటీ అధ్యక్షుడిగా కొట్టే శ్రీశైలం ఆదివారం జరిగిన ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాటారం మహాదేవపూర్ మహాముతారం, మల్హర్, పలిమెల మండలాల్లోని ప్రైవేట్ పాఠశాలల కరస్పాండెంట్లు ఆదివారం వివేకానంద పాఠశాలలో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా కొట్టే శ్రీశైలం, ప్రధాన కార్యదర్శి రేగటి రాజబాబు, కోశాధికారిగా బుర్ర వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షుడిగా సుభాష్, సంయుక్త కార్యదర్శిగా రాజును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షులు నాగుల దేవేందర్ రెడ్డి , ప్రధాన కార్యదర్శి చీర్ల శ్రీనివాస్ రెడ్డి , వలుస వెంకటేశ్వర్లు ఎన్నికల పరిశీలకులుగా వ్యవహరించారు.
Recent Comments