ప్రాణహిత కు వాయనం..
స్పాట్ వాయిస్, కాళేశ్వరం: ప్రాణహిత పుష్కరాలు భక్తిశ్రద్ధల నడుమ సాగుతున్నాయి. శుక్రవారం సాయంత్రం అర్జున గుట్ట ప్రాణహిత పుష్కర ఘాట్ లో పదో రోజు ప్రాణహిత నది హారతి కార్యక్రమంలో పుష్కరాల చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ టీ.శ్రీకాంత్ రావు, ఆదిలాబాద్ సహాయ కమిషనర్ ఆదేశాల మేరకు దేవాదాయ ధర్మాదాయ శాఖ భద్రకాళీ అమ్మవారి దేవస్థానం కార్యనిర్వహణాధికారి శేషు భారతి, అర్చకులు, దేవస్థాన సిబ్బంది వెళ్లారు. నది హారతి కోసం వాయనం ఇవ్వడానికి భాజాభజంత్రీలతో వచ్చి భక్తుల సమక్షంలో సమర్పించారు. హారతి ముగిసిన తదనంతర అమ్మవారి ప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఘాట్ ఇంఛార్జి వి.అనూష లైజనింగ్ ఆఫీసర్ ఆర్.రవికిషన్ కార్యనిర్వహణాధికారులు, గ్రామ సర్పంచ్, ప్రజాప్రతినిధులు వివిధ శాఖ అధికారులు, భక్తుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు.
ప్రాణహితకు వాయనం
RELATED ARTICLES
Recent Comments