Thursday, May 22, 2025
Homeజిల్లా వార్తలురేపటి ప్రజావాణి రద్దు

రేపటి ప్రజావాణి రద్దు

వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి
జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ,

స్పాట్ వాయిస్, భూపాలపల్లి టౌన్ : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల జిల్లాలోని గోదావరి, చెరువులు, వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఈ సందర్భంగా అధికారులు అత్యవసర విధుల్లో నిమగ్నమై ఉన్నందున 22వ తేదీ సోమవారం జిల్లా, మండల స్థాయిలో జరగాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆదివారం ప్రకటనలో తెలిపారు. ప్రజలు విషయాన్ని గమనించి సోమవారం ప్రజావాణి కార్యక్రమానికి ఎవరూ రావొద్దని సూచించారు. అధికారులు అప్రమత్తంగా ఉండి పరిస్థితులను పర్యవేక్షించాలని, మండల ప్రత్యేక అధికారులు వారి నిర్దిష్ట మండలాల్లోనే ఉండి మండల స్థాయిలో వివిధ విభాగాలతో సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments