టీఆర్ఎస్ కు మంత్రి సోదరుడి రాజీనామా..
ఎన్నో అవమానాలు భరించా..
ఇక పార్టీ లో ఉండలేను..
స్పాట్ వాయిస్: వరంగల్: రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సోదరుడు, వరంగల్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకు అధ్యక్షుడు ఎర్రబెల్లి ప్రదీప్రావు టీఆర్ఎస్ ను వీడారు. ఆ పార్టీకి రాజీనామా చేసినట్లు ఆయన ప్రకటించారు. 2018 ఎన్నికల్లో వరంగల్ తూర్పు నుంచి ఎమ్మెల్యే టికెట్, తర్వాత ఎమ్మెల్సీ పదవి ఆశించి భంగపడిన ప్రదీప్రావు.. అప్పటి నుంచి పార్టీపై అసంతృప్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ కు రాజీనామా చేసినట్లు ఆదివారం తెలిపారు. వరంగల్లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రదీప్రావు బీజేపీలో చేరడం ఖాయమని.. కేంద్రమంత్రి అమిత్షా సమక్షంలో ఆ పార్టీలో ఆయన చేరనున్నట్లు తెలిసింది.
Recent Comments