Sunday, May 19, 2024
Homeసినిమారాజాసాబ్ గా ప్రభాస్..

రాజాసాబ్ గా ప్రభాస్..

రాజాసాబ్ గా ప్రభాస్..

సరికొత్త లుక్ లో డార్లింగ్ 

స్పాట్ వాయిస్, డెస్క్ : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరికొత్త మూవీ తో వస్తున్నాడు. సాలర్ విజయంతో 2023ని పూర్తి చేసుకున్న ఆయన అంతకుమించిన వినోదాల్ని 2024లో పంచబోతున్నారు. ప్రభాస్‌ కథానాయకుడిగా మారుతి దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌, టైటిల్‌ను సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేశారు. ఈ చిత్రానికి ముందునుంచి ప్రచారంలో వున్న ‘రాజాసాబ్’ అనే పేరుని పెట్టారు. ఫస్ట్ లుక్ పోస్టర్ గురించి చెప్పాలంటే సలార్ లో ‘డైనోసార్‌’లా కనిపించిన ఆయన ఇప్పుడు రాజాసాబ్ లో మళ్ళీ వింటేజ్ డార్లింగ్‌ లుక్ లోకి మారిపోయారు. నల్లచొక్కా గళ్ళ లుంగీ కొట్టుకొని నవ్వుతూ నడిచి వస్తున్న లుక్ నిజంగా పండగ కళని తీసుకొచ్చింది. హారర్ టచ్ వున్న ఈ కథలో ప్రభాస్‌ విభిన్నమైన పాత్రలో కనువిందు చేయనున్నారని ఫస్ట్ లుక్ చూస్తే అర్ధమౌతోంది. ఈ ఏడాదిలోనే ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మరోవైపు నాగ్ అశ్విన్ తో చేస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ కల్కి కూడా ఈ ఏడాది ప్రేక్షకులని పలకరించనుంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments