అధికారం బీజేపీదే..
దళిత బంధుకే దిక్కులేదు..గిరిజన బంధా..!
మాజీ మంత్రి బాబు మోహన్
పార్టీ కోసం కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలి
బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి చందుపట్ల కీర్తి రెడ్డి
స్పాట్ వాయిస్, రేగొండ : రాష్ట్రంలో రానున్న ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ఆ రాష్ట్ర నాయకుడు , మాజీ మంత్రి బాబు మోహన్ ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు, భూపాలపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ చందుపట్ల కీర్తి రెడ్డి ఆధ్వర్యంలో ప్రజాగోశా.. బీజేపీ భరోసా బైక్ ర్యాలీ యాత్రకు బాబుమోహన్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముందుగా మండలంలోని రూపిరెడ్డిపల్లి గ్రామంలో రామాలయంలో ప్రత్యేక పూజలు చేసి బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం బైక్ ర్యాలీ రూపురెడ్డిపల్లి చిన్న కొడపాక గోరుకొత్తపల్లి నిజాంపల్లి కోనరావుపేట సుల్తాన్పూర్ తిరుమలగిరి జగ్గయ్యపేట నారాయణపూర్, బాగిర్తి పేట దుంపిల్ల పల్లి, గూడపల్లి, రేగొండ లో సాగింది. బైక్ ర్యాలీలో బాబు మోహన్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. మండలంలోని పలు గ్రామాల్లో బీజేపీ జెండా ఎగరవేసి సంబురాలను జరుపుకున్నారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ప్రధాని నరేంద్ర మోడీ చేస్తున్న అభివృద్ధికి అనేక రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చిందని ఆయన అన్నారు. తెలంగాణకు అనేక సంక్షేమ పథకాలను ఇస్తున్నప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంలో విఫలమైందని ఆయన ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తన స్వలాభం కోసం కుటుంబ పాలన నడుస్తుందని ఆరోపించారు.అనంతరం భూపాలపల్లి నియోజకవర్గ ఇన్చార్జి చందుపట్ల కీర్తి రెడ్డి మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ పాలన నడుస్తుందని రానున్న రోజుల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని ఆమె అన్నారు. రానున్న రోజుల్లో భూపాలపల్లి గడ్డపై బీజేపీ జెండా ఎగిరేవేయడం ఖాయమని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ప్రతీ గడపకు చేరే వేసే విధంగా ప్రతి కార్యకర్త కంకణ బద్ధులై పని చేయాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వెన్నంపల్లి పాపయ్య, మండల అధ్యక్షుడు దాసరి తిరుపతిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఏడునూతుల నిశిధర్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు ప్రసాద్ రావు, నాయకులు మనోహర్ , రామచంద్రారెడ్డి గణపతి, రాజు మల్లేష్, రాకేష్, గణేష్, పోశాల రాజు, లింగారెడ్డి బుచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Recent Comments