Thursday, November 14, 2024
Homeతెలంగాణఊ అంటే.. బాధుడే..

ఊ అంటే.. బాధుడే..

విద్యుత్ చార్జీల పెంచుడేనా..?!
ప్రతిపాదనలు పంపిన డిస్కంలు..
ఊ అంటే.. బాధుడే..
స్పాట్ వాయిస్, బ్యూరో: రేవంత్ రెడ్డి సర్కార్ విద్యుత్ ఛార్జీలు పెంచేందుకు రెడీ అవుతోంది. ఈ మేరకు డిస్కంలు కసరత్తు షురూ చేశాయి. ప్రభుత్వానికి ప్రతిపాదనలు సైతం పంపించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గానూ.. తెలంగాణలో రూ.1200 కోట్ల మేర విద్యుత్‌ ఛార్జీల పెంపునకు.. ప్రభుత్వ అనుమతి కోరుతూ డిస్కంలు ప్రతిపాదనలు పంపాయి. హైటెన్షన్ కేటగిరీ విద్యుత్ ఛార్జీల పెంపు.. లోటెన్షన్‌ ఛార్జీల పెంపు పేరుతో డిస్కంలు ప్రతిపాదలు పంపించడం గమనార్హం. హైటెన్షన్ కేటగిరీకి ఛార్జీల పెంపుతో రూ.700 కోట్లు.. ఫిక్స్‌డ్ ఛార్జీల పెంపుతో రూ.100 కోట్లు కలిపి మొత్తం రూ.800 కోట్ల భారం ప్రజలపై పడనుంది. ఇదిలా ఉంటే.. మరో రూ.400 కోట్లను లోటెన్షన్ కేటగిరి విద్యుత్ వినియోగదారుల నుంచి ఫిక్స్‌డ్‌ ఛార్జీల పెంపుతో రాబట్టుకోనున్నట్టు ప్రతిపాదనల్లో డిస్కంలు పేర్కొన్నాయి. డిస్కంలు ప్రభుత్వానికి పంపించిన ప్రతిపాదనలను బట్టి చూస్తుంటే.. రేవంత్ రెడ్డి సర్కార్ త్వరలోనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం లేకపోలేదు. ఒకవేళ రేవంత్ రెడ్డి సర్కార్ డిస్కంలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. విద్యుత్ ఛార్జీలు పెరిగి.. సామాన్యుల జేబులకు చిల్లులు పడటం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే పెరిగి ధరలతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంగా.. ఇప్పుడు విద్యుత్ ఛార్జీల పెంపు గుదిబండగా మారనుంది. అయితే.. విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనలపై ప్రతిపక్ష బీఆర్‌ఎస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. డిస్కంల ప్రతిపాదనలకు రేవంత్ రెడ్డి సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే మాత్రం.. నవంబర్‌ ఒకటో తారీఖు నుంచే ఛార్జీల మోత మోగే అవకాశం ఉంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments