కరెంటు స్తంభాన్ని ఢీకొన్న ట్రాక్టర్
నిలిచిన విద్యుత్ సరఫరా
స్పాట్ వాయిస్, నల్లబెల్లి : మండలంలోని లెంకలపల్లి గ్రామంలో విద్యుత్ స్తంభాన్ని ట్రాక్టర్ ఢీ కొంది. దీంతో విద్యుత్ స్తంభం విరిగిపోగా.. గ్రామ అంతా చీకట్లు కమ్ముకున్నాయి. ప్రస్తుతం ఎండలు విపరీతంగా పెరగడం, దోమలు విజృంభిస్తున్న కాలంలో కరెంటు లేకపోవడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చిన్నపిల్లలతో కాలనీలో ఆరుబయట నిద్రించాల్సిన పరిస్థితి నెలకొందని లెంకలపల్లి వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
చిమ్మచీకట్లో లెంకలపల్లి
RELATED ARTICLES
Recent Comments