Saturday, May 24, 2025
Homeజిల్లా వార్తలుకరెంటు సామగ్రి చోరీ..

కరెంటు సామగ్రి చోరీ..

కరెంటు సామగ్రి చోరీ

 

స్పాట్ వాయిస్, దామెర: మండలంలోని సింగరాజుపల్లి గ్రామ శివారులోని దేవాదుల ప్రాజెక్టు స్టాప్ క్వాటర్స్ లో గుర్తుతెలియని వ్యక్తులు ఈ నెల 18,20వ తేదీలలో రాత్రి సమయంలో క్వాటర్స్ లో గది తాళాలు పగులగొట్టి రూ .1,10,000 వేల విలువ చేసే కరెంట్ కాపర్ వైర్, ఆయిల్ ను చోరీ చేసినట్లు ఎస్సై రాజేందర్ తెలిపారు. ఎస్సై రాజేందర్ కథనం ప్రకారం ఈ నెల 18,20వ తేదీల మధ్య కాలంలో సింగరాజుపల్లి గ్రామ శివారులో గల దేవాదుల ప్రాజెక్టు స్టాప్ క్వాటర్స్ లో గుర్తుతెలియని వ్యక్తులు తాళాలు పగులగొట్టి రూ .1,10,000 వేల విలువ చేసే కరెంట్ కాపర్ వైర్, ఆయిల్ ను దొంగిలించారని విద్యుత్ శాఖ ఏఈ గుర్రం రమేష్ ఫిర్యాదు చేసారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజేందర్ ఒక ప్రకటనలో తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments