ఉన్నత స్థాయికెదిగి నలుగురికి సాయపడాలి
గ్రేటర్ వరంగల్ మేయర్ గుండు సుధారాణి
130 మంది పద్మశాలి ప్రతిభా పురస్కారాలు అందజేత
స్పాట్ వాయిస్, వరంగల్ : పద్మశాలీ కులస్తులు అన్ని రంగాల్లో రాణించాలని గ్రేటర్ వరంగల్ మేయర్ గుండు సుధారాణి అన్నారు. విద్యార్థులు నైపుణ్యతా ప్రమాణాలు పెంచుకుని, ఉన్నత స్థాయికెదిగి నలుగురికి సాయపడాలని ఆమే పేర్కొన్నారు. పద్మశాలి విద్యావిభాగం, పద్మశాలి అఫీషియల్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (పోపా) ఉమ్మడి వరంగల్ జిల్లా సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం వరంగల్ శివనగర్ లోని పద్మశాలి కల్యాణ మండపంలో నిర్వహించిన కార్యక్రమంలో మేయర్ గుండు సుధారాణి ముఖ్య అతిథిగా హాజరై పద్మశాలి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండు ప్రభాకర్, పోపా రాష్ట్ర అధ్యక్షుడు శామంతుల శ్రీనివాస్ తో కలిసి పురస్కారాలను అందజేశారు. ఈ సందర్భంగా మేయర్ సుధారాణి మాట్లాడుతూ విద్యతోనే ఉన్నత స్థాయికి ఎదుగుతామన్నారు. సమాజంలో చేనేతలకు సహాయ పడాలని సూచించారు. మరో ముఖ్య అతిథి పోపా రాష్ట్ర అధ్యక్షుడు శామంతుల శ్రీనివాస్ మాట్లాడుతూ సివిల్స్, గ్రూప్స్ లాంటి ఉన్నత స్థాయి ఉద్యోగాల్లో మన వాళ్లు చాలా మంది ఉన్నారని, వారంతా ప్రతిభ గల పేద పద్మశాలి విద్యార్థులకు సహాయం చేయాలని సూచించారు.
130 మంది ప్రతిభా పురస్కారాలు..
కాగా, ఈ కార్యక్రమంలో ఎస్ ఎస్ సీలో 10 జీపీఏ సాధించిన 40 మందికి, ఇంటర్ లో ప్రతిభ కనబర్చిన 40 మందికి, అలాగే నీట్ లో 15 మందికి, జేఈఈ అడ్వాన్స్ లో 10 మంది, జేఈఈ మెయిన్స్ లో 10 మందికి, ఎంసెట్ ఇంజినీరింగ్ లో ప్రతిభ కనబర్చిన 15 మంది పద్మశాలి విద్యార్థులకు ముఖ్య అతిథులు మేయర్, గుండు సుధారాణి, పోపా రాష్ట్ర అధ్యక్షుడు శామంతుల శ్రీనివాస్ అవార్డులను ప్రదానం చేశారు. అలాగే 18 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సన్మానం చేశారు.
కార్యక్రమంలో పోపా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గుండు కామేశ్వర్, సామల శ్రీనివాస్, విద్యావిభాగం అధ్యక్ష కార్యదర్శులు ప్రొఫెసర్ వంగరి సూర్యనారాయణ, నందాల చందర్ బాబు, ముఖ్య అతిథులు గుండు ప్రభాకర్, ప్రొఫెసర్ దామోదర్, ప్రొఫెసర్ వెంకట నారాయణ, ప్రొఫెసర్ రుద్ర సాయిబాబా, బార్ కౌన్సిల్ మెంబర్ దుస్సా జనార్దన్, గంజి నగేష్, మాటేటి అశోక్, సంతోష్, వేముల సదానందం, పద్మశాలి సంఘం నాయకులు వడ్నాల నరేందర్, ఎమ్మార్వో కుసుమ సత్యనారాయణ, డాక్టర్ వైద్యం గౌతం, డాక్టర్ చిలుకమారి గోపి, డాక్టర్ హరీష్ గోసికొండ, ధర్మపురి రాజగోవింద్, వడ్నాల సత్యనారాయణ, కందగట్ల రాకేష్, వంగల సదానంద్, తుమ్మ రమేష్, మేరుగు సుబాష్, చెన్నూరి రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Recent Comments