Saturday, April 5, 2025
Homeకెరీర్పాలిసెట్‌ ఫలితాలు విడుదల..

పాలిసెట్‌ ఫలితాలు విడుదల..

స్పాట్ వాయిస్, ఎడ్యుకేషన్: తెలంగాణ పాలిసెట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ నవీన్ మిట్టల్‌ బుధవారం ఫలితాలను విడుదల చేశారు. పాలిసెట్ ఎంపీసీ విభాగంలో 75.73 శాతం ఉత్తీర్ణత సాధించగా.. పాలిసెట్ ఎంబైపీసీ విభాగంలో 75.81 శాతం మంది ఉత్తీర్ణులైనట్లు నవీన్ మిట్టల్ తెలిపారు. పాలిటెక్నిక్ ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు వెల్లడించారు. జూన్‌ 30న 365 కేంద్రాల్లో ఈ పరీక్షను నిర్వహించగా.. 14,432 మంది విద్యార్థులు హాజరయ్యారు. పాలిటెక్నిక్‌ డిప్లొమా కోర్సులతో పాటు అగ్రికల్చర్‌, వెటర్నరీ, హార్టికల్చర్‌, బాసర ట్రిపుల్‌ ఐటీ ప్రవేశాలను పాలిసెట్‌ ర్యాంకు ఆధారంగా భర్తీ చేయనున్నారు. ఫలితాలు అధికారిక వెబ్​సైట్​ https://polycetts.nic.in/Default.aspx లో చూసుకోవచ్చు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments