Wednesday, November 27, 2024
Homeజాతీయంకేసీఆర్ జాతీయ పార్టీ పేరు ఫిక్స్...

కేసీఆర్ జాతీయ పార్టీ పేరు ఫిక్స్…

స్పాట్ వాయిస్ , హైదరాబాద్:    జాతీయ రాజకీయాలపై టీఆర్ఎస్ నేతలకు సీఎం కేసీఆర్ స్పష్టతనిచ్చారు. టీఆర్ఎస్ పేరు మార్చి జాతీయ పార్టీగా రూపాంతరం చేస్తూ దసరా రోజున మధ్యాహ్నం 1. 10 నిమిషాలకు పార్టీ విస్తృతస్థాయి కార్యవర్గం తీర్మానం చేయనుంది. జాతీయ పార్టీ ఏర్పాటుపై ఆదివారం మంత్రులు, జిల్లా అధ్యక్షులతో కేసీఆర్ ప్రగతిభవన్‌లో చర్చించారు.

తెలంగాణను చూపి…
కొత్త రాష్ట్రమైనప్పటికీ.. తెలంగాణను అన్ని రంగాల్లో శరవేంగా ముందుకు తీసుకెళ్లి దేశాన్ని ఆకర్షించగలిగినట్లు కేసీఆర్ వివరించారు. రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై దేశమంతా ఆకర్షితులవుతున్నారని తెలిపారు. తెలంగాణ మోడల్‌ను దేశమంతటికీ విస్తరించేందుకు జాతీయ రాజకీయాల్లోకి రావాలన్న వివిధ వర్గాలు కోరుకుంటున్నాయని తెలిపారు. కాబట్టి పార్టీ శ్రేణులు అంగీకరిస్తే టీఆర్ఎస్ దేశవ్యాప్తంగా విస్తరించాల్సిన అసరముందని కేసీఆర్ చెప్పడంతో.. మంత్రులు, జిల్లా అధ్యక్షులు ముక్తకంఠంతో ఆమోదించారు.

టీఆర్ఎస్ ఇక బీఆర్ఎస్...
జాతీయ పార్టీ ఏర్పాటుపై నేతలకు కేసీఆర్ స్పష్టతనిచ్చారు. వివిధ అంశాలపై లోతైన అధ్యయనం చేశాక ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర సమితి పేరు మార్చనున్నట్లు కేసీఆర్ వివరించారు. పార్టీ పేరుపై అభిప్రాయాలు కోరగా… భారత రాష్ట్ర సమితి.. నయా భారత్ సమితి వంటి పేర్లను నాయకులు సూచించారు. కొత్తగా పార్టీ ఏర్పాటు చేస్తే కారు గుర్తు కొనసాగకపోవచ్చు కాబట్టి.. ఉన్న పార్టీ పేరునే మారిస్తే సాంకేతికంగా ఇబ్బంది ఉండదని కేసీఆర్ వివరించారు. కేసీఆర్ సహా ఎక్కువ మంది నేతలు భారత రాష్ట్ర సమితి పేరుకే మొగ్గు చూపారు.

5న ప్రకటన..
దసరా రోజున ఉదయం 11 గంటలకు తెలంగాణ భవన్‌లో పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్ ఛైర్మన్లు, రాష్ట్ర కార్యవర్గం సహా కీలక ప్రతినిధులు సమావేశం కానున్నారు. టీఆర్ఎస్ పేరు మారుస్తూ తీర్మానంపై సంతకాలు చేశాక.. మధ్యాహ్నం 1.10 నిమిషాలకు కేసీఆర్ ఆమోద ముద్ర వేయనున్నారు. ఆరోజు వివిధ రాష్ట్రాల నుంచి పలువురు నేతలు, ప్రతినిధులను ఆహ్వానించాలని నిర్ణయించారు. 6న టీఆర్ఎస్ పేరు మార్పుపై ఎన్నికల కమిషన్ కు అఫిడవిట్ సమర్పించనున్నారు. పార్టీ పేరు మార్పును ఈసీ ఆమోదించిన తర్వాత పూర్తి స్థాయి జెండా, అజెండా ప్రకటించనున్నారు.

ఢిల్లీలో సభ
డిసెంబరు 9న ఢిల్లీలో బహిరంగ సభ నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు. టీఆర్ఎస్ జాతీయ పార్టీగా ఎందుకు మారాల్సి వచ్చిందనే పూర్తి విషయాలను కేసీఆర్ ఢిల్లీ సభలో వెల్లడించనున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments