Sunday, April 20, 2025
Homeతెలంగాణపోలీసు కొత్త బాస్ నియామకం..

పోలీసు కొత్త బాస్ నియామకం..

గతంలో వరంగల్ రేంజ్ డీఐజీగా పని చేసిన జితేందర్

స్పాట్ వాయిస్, బ్యూరో: తెలంగాణ రాష్ట్ర డీజీపీగా జితేందర్‌ నియామకయ్యారు. ఈ మేరకు బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం డీజీపీగా కొనసాగుతున్న రవిగుప్తాను హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బదిలీ చేశారు. జితేందర్‌ 1992 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నిర్మల్ ఏఎస్పీగా పని చేశారు. ఆ తర్వాత బెల్లంపల్లి అదనపు ఎస్పీగా విధులు నిర్వర్తించారు. నక్సల్స్ ప్రభావం ఎక్కువగా ఉన్న మహబూబ్‌నగర్, గుంటూరు జిల్లాకు ఎస్పీగానూ సేవలందించారు. ఢిల్లీలో సీబీఐలో కొంతకాలం పనిచేశారు. 2004-06 మధ్య గ్రేహౌండ్స్ బాధ్యతలు చేపట్టారు. విశాఖపట్నం రేంజ్ డీఐజీగా బాధ్యతలు నిర్వర్తించారు. తెలంగాణ ఉద్యమం సమయంలో వరంగల్ రేంజ్ డీఐజీగా పని చేశారు. ఏపీ సీఐడీ, ఎంక్వైరీ కమిషన్, విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్‌మెంట్‌లో పని చేశారు. హైదరాబాద్ కమిషనరేట్‌లో అదనపు ట్రాఫిక్‌ కమిషనర్‌, తెలంగాణ శాంతిభద్రతల విభాగం అదనపు డీజీపీగా, జైళ్లశాఖ డీజీగా పని చేశారు. ప్రస్తుతం ఆయన హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా కొనసాగుతున్నారు. వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో పదవీ విరమణ చేయనున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments