వ్యక్తిపై కేసు నమోదు
స్పాట్ వాయిస్ నర్సంపేట, (ఖానాపురం): ఖానాపూర్ ఎస్సై మాధవ్ ఆధ్వర్యంలో సానిక పోలీసులు మండలంలోని చిలకమ్మ నగర్ లోని గుడుంబా స్టావరాలపై దాడి చేశారు. ఈ దాడిలో మూడు లీటర్ల గుడుంబా స్వాధీనం చేసుకుని వంద లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు. గుడుంబా తయారు చేస్తున్న బానోతు హరిలాల్ పై కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఎస్సై మాధవ్ మాట్లాడుతూ.. గుడుంబా తయారు చేసినా, విక్రయించిన, గుడుంబా తయారీకి ఉపయోగించే వస్తువులు కలిగి ఉన్నా చట్ట ప్రకారం నేరమని తెలిపారు. ఈ దాడుల్లో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
గుడుంబా స్థావరాలపై పోలీసుల దాడి
RELATED ARTICLES
Recent Comments