గణపురంలో గంటల వ్యవధిలో రెండు ప్రయత్నాలు
భయాందోళనలో స్థానికులు
పోలీసులు వైఫల్యాలను ఎత్తి చూపుతున్న దొంగలు
స్పాట్ వాయిస్, గణపురం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలో చైన్ స్నాచింగ్ దొంగలు కలకలం రేపుతున్నాయి. మండలం కేంద్రంలోని గుడివాడ సమీపంలో శనివారం మిట్ట మధ్యాహ్నం ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆడుకుంటున్న పిల్లల దగ్గరకు వెళ్లి డబ్బులివ్వాలి “నాన్న ఉన్నాడా..” అని అడగ్గానే, వారు మమ్మీ ఉందని ఆమెను పిలిచారు. సదరు మహిళా బయటకు రాగానే ఆమె మెడలోని సుమారు రెండున్నర తులాల మంగళసూత్రాన్ని లాక్కొని బైక్ పై పారిపోయాడు. ఈ ఘటన జరిగిన గంటల వ్యవధి లోనే ఎస్సీ కాలనీలో మరో దొంగతనానికి యత్నించాడు. చోరికి పాల్పడిన వ్యక్తి ని స్థానికులు పట్టుకునే ప్రయత్నం చేయగా తప్పించుకున్నాడు. వరుస చోరీలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా ఒకే రోజు రెండు ఘటనలతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. పోలీసుల నిఘా వైఫల్యం వల్లే.. దొంగలు రెచ్చిపోతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
Recent Comments