Saturday, April 5, 2025
Homeక్రైమ్పోలీస్ శాఖలో విషాదం..

పోలీస్ శాఖలో విషాదం..

ఒకే రోజు ఎస్సై.. ఏఎస్సై మృతి..
స్పాట్ వాయిస్, బ్యూరో: పోలీస్ శాఖలో విషాదం నెలకొంది. ఒకే రోజు ఇద్దరు ఎస్సైలు మత్యువాత పడ్డారు. యాక్సిడెంట్‌లో ఎస్సై.. గుండెపోటుతో అదనపు ఎస్సై ప్రాణాలు విడ్చారు. వివరాల్లోకి వెళితే.. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం చిల్వాకోడూరు సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. కారు, ద్విచక్రవాహనం ఢీకొన్న ప్రమాదంలో మహిళా ఎస్సై శ్వేత ప్రాణాలు కోల్పోయింది. జగిత్యాల జిల్లా పోలీస్‌ డీసీఆర్‌బీలో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న శ్వేతతో పాటు ద్విచక్రవాహనంపై ఉన్న వాహనదారుడు తీవ్ర గాయాలతో మృతి చెందారు.
గుండెపోటుతో మరో ఏఎస్సై..
ఆదిలాబాద్ జిల్లా జన్నారం మండల అదనపు ఎస్సై రాథోడ్ తానాజీ నాయక్ హార్ట్ ఎటాక్‌తో కన్నుమూశాడు. సోమవారం ఉదయం నిద్రలోనే ఆయన గుండెపోటుకు గురయ్యాడు. స్టేషన్ క్వార్టర్స్‌లో ఉంటున్న తానాజీ.. ఛాతీలో నొప్పి వస్తోందని హోంగార్డుకు ఫోన్ చేసి చెప్పాడు. హోంగార్డు వెంటనే అక్కడకు చేరుకొని ఆయన్ను సమీపంలోని ఆసుపత్రికి తరలించాడు. అయితే అప్పటికే తానాజీ మృతి చెందినట్లు వెల్లడించారు. ఇదిలా ఉంటే మరో 10 నెలల్లో తానాజీ రిటైర్మెంట్ కావాల్సి ఉంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments