వరంగల్ కమిషనరేట్ లో సస్పెన్షన్ల పరంపర
సీఐ సహా ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుల్ సస్పెండ్
మొన్నటికి మొన్న ఒక సీఐ, ఇద్దరు ఎస్సైల సస్పెన్షన్
స్పాట్ వాయిస్, క్రైం: వరంగల్ కమిషనరేట్ లో సస్పెన్షన్ల పరంపర కొనసాగుతోంది. సీపీ ఏవీ రంగనాథ్ విధుల్లో నిర్లక్ష్యం వహించే వారిపై కొరఢా ఝళిపిస్తున్నారు. మొన్నటికిమొన్న ఒక సీఐ, ఇద్దరు ఎస్సైలను సస్పెండ్ చేశారు. వారం రోజుల వ్యవధిలో మరో సీఐని, ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లతో పాటు మరో కానిస్టేబుల్ను సస్పెండ్ చేశారు. తాజాగా సోమవారం సాయంత్రం సస్పెండ్ చేసిన వారిలో టాస్క్ ఫోర్స్ విభాగానికి చెందిన ఇన్ స్పెక్టర్ వి.నరేష్ కుమార్ తో పాటు ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు పి.శ్యాంసుందర్, కె.సోమలింగం, కానిస్టేబుల్ బి సృజన్ ను సస్పెండ్ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవి రంగనాథ్ ఉత్తర్వులు జారీ చేశారు. పీడీఎస్ రైస్ అక్రమ రవాణాకు సంబంధించి నిందితుల పై ఎలాంటి కేసులు నమోదు చేయకుండా వారి నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడుతుడంతో పాటు ఇతరత్రా అక్రమ వసూళ్లకు కూడా పాల్పడుతున్నట్లుగా వచ్చిన ఆరోపణలు నిర్ధారణ కావడంతో వీరిని సస్పెండ్ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు
వరంగల్ కమిషనరేట్ లో సస్పెన్షన్ల పరంపర
RELATED ARTICLES
Recent Comments