ఆపదొస్తే.. 9440904691 కాల్ చేయండి
దామెర ఎస్సై హరిప్రియ
స్పాట్ వాయిస్, దామెర: అల్పపీడన ద్రోణీతో ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున గ్రామాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని దామెర ఎస్సై హరిప్రియ తెలిపారు.ఈ సందర్భంగా ఎస్సై హరిప్రియ మాట్లాడుతూ… ప్రజలు తడిసిన విద్యుత్ స్థంభాలు, గోడలను తాకరాదని, ఇనుప జె వైర్ లపై దుస్తులు ఆరవేయవద్దని, శిథిలావస్థలో ఉన్న మట్టి గోడల ఇండ్లలో నివాసం ఉండకుండా వెంటనే ఖాళీ చేయాలని సూచించారు. రైతులు వ్యవసాయ బావులు, బోర్ల వద్ద తడిసిన స్టార్టర్ బాక్సు, ఫ్యూజ్ బాక్స్ లను తాకొద్దని, వరద నీటికి చెరువులు, కుంటలు నిండి చెరువు కట్టలు తెగిపోయే ప్రమాదం ఉందన్నారు. వాగుల్లో నీటి ప్రవాహం ఎక్కువగా ఉంటుందని ఎవరు ఈతలకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. ప్రజలు ఇంటి నుంచి బయటకు అత్యవసర మైతే తప్పా.. రాకూడదని, అత్యవసర సమయంలో 100 డయల్ కు కాని, పోలీస్ స్టేషన్ నంబర్ 9440904691 నంబరులో సంప్రదించాలని ఎస్సై హరిప్రియ సూచించారు.
ఆపదొస్తే.. 9440904691 కాల్ చేయండి
RELATED ARTICLES
Recent Comments