Saturday, September 21, 2024
Homeతెలంగాణస్పాట్ ఫ్లాష్..: పోలీస్ ఉద్యోగాలకు దరఖాస్తు గడువు పెంపు..

స్పాట్ ఫ్లాష్..: పోలీస్ ఉద్యోగాలకు దరఖాస్తు గడువు పెంపు..

స్పాట్ వాయిస్, హైదరాబాద్: పోలీస్‌ ఉద్యోగాల దరఖాస్తు గడువును పోలీస్‌ రిక్రూట్ మెంట్ బోర్డ్ పొడిగించింది. శుక్రవారం రాత్రి 10 గంటలతో గడువు ముగియనున్న నేపథ్యంలో ఈ నెల 26వ తేదీ వరకు గడువును పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నది. ఇదిలా ఉండగా.. కానిస్టేబుల్ ఉద్యోగాల‌కు సంబంధించి.. అభ్యర్థులకు విజ్ఞప్తుల మేరకు రెండేళ్ల వయో పరిమితిని పెంచుతూ సీఎం కేసీఆర్‌ ఈ రోజే నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో దరఖాస్తు గడువును పొడిగించినట్లు తెలుస్తున్నది. మరో వైపు పోలీస్‌, ఎక్సైజ్‌, ఫైర్‌, జైళ్లు, రవాణా శాఖల్లో కలిపి 17,291 యూనిఫాం ఉద్యో‌గాల భర్తీకి ఈ నెల 2 నుంచి దర‌ఖాస్తు ప్రక్రియ ప్రారం‌భించారు. అన్ని విభా‌గా‌లకు కలిపి గురు‌వారం వరకు 5.2 లక్షల మంది అభ్యర్థుల నుంచి 9.33 లక్షల దర‌ఖా‌స్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇందులో మహిళా అభ్యర్థుల నుంచి 2.05 లక్షల దరఖాస్తులు అందాయి. ప్రస్తుతం దరఖాస్తు గడువు పొడిగించడంతో దరఖాస్తులు భారీగా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments